రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లాలో జులై 1 వరకు నిషేధాజ్ఞలు పొడిగించినట్టు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ పౌరులు, మహిళలు. పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం అన్నారు. అలాగే డీజే , డ్రోన్ల వినియోగించరాదన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa