మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీనాథ్ స్పిన్నింగ్ మిల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు ఈ ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, సుమారు 55-60 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక గుర్తుతెలియని పురుషుడిగా గుర్తించారు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే మేడ్చల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa