ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూకట్‌పల్లిలో డీవీజీ ట్రస్ట్ ద్వారా అంత్యక్రియలకు ఆర్థిక సాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 06:53 PM

కూకట్‌పల్లి నియోజకవర్గం, 124 ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని ఎల్లమ్మబండ పరిధిలో జయశంకర్ కాలనీ, బ్లాక్ నెంబర్ 183లో నివాసం ఉంటున్న బి. శ్రీనివాస్ రాజు (53) అనారోగ్యంతో మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనయుడు, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా డీవీజీ ట్రస్ట్ ద్వారా రూ. 5,000/- ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa