కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఏయే శాఖల ఇవ్వబోతున్నారనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే CM రేవంత్ తన వద్ద ఉన్న శాఖలనే వారికి కేటాయించబోతున్నట్లు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈ మేరకు గడ్డం వివేక్ వెంకటస్వామికి న్యాయ, కార్మిక, క్రీడా శాఖలు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు SC, ST సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, వాణిజ్య పన్నుల శాఖలు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికాసేట్లో అధికారిక ప్రకటన రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa