తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్రమంత్రి సమావేశమయ్యారు.గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ 13 అంశాలతో తెలంగాణ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలను కేంద్రం ముందు ఉంచాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa