ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి మత్తులో కారు పైకి ఎక్కి యువకుడు హల్‌చల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 11:06 AM

TG: హైదరాబాద్‌ మూసాపేటలో గంజాయి మత్తులో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న కారును ఆపేసి దానిపై ఎక్కి హంగామా సృష్టించాడు. ఆ సమయంలో కారులో ఓ కుటుంబం ఉండగా, కారు అద్దాలు పగలకొట్టేందుకు ప్రయత్నం చేశాడు. వారు భయంతో కేకలు వేస్తూ... అన్నా పక్కకు వెళ్లు అని వేడుకున్నారు. వెంటనే స్థానికులు స్పందించి అతడిని పట్టుకొని కారు పైనుంచి దింపేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa