మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. హావేలిఘనపూర్ మండలం రాజీపేట తండా దగ్గర వరదలో 10 మంది చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వాతావరణం అనుకూలించగానే సహాయం అందించేందుకు హెలికాప్టర్ పంపిస్తామని భరోసా ఇచ్చారు. అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారని, అధైర్యపడొద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa