వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో గురువారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పింఛన్ దారుల సన్నాహక సభ జరిగింది. ఈ సభలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాత పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సభ నిర్వహించారు. సెప్టెంబర్ 9న పెన్షన్ దారుల ఛలో హైదరాబాద్ మహాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa