బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవితను కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. ఆమె తండ్రి పెట్టిన పార్టీనే నాశనం చేసింది. కాంగ్రెస్ లోకి వస్తే ఈ పార్టీని కూడా నాశనం చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాళేశ్వరం పంచాయితీ ఇప్పుడు బీఆర్ఎస్ ఇంటి పంచాయితీగా మారిందన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతిచ్చి 8 స్థానాల్లో గెలిచేందుకు కారణమైన బీఆర్ఎస్ ఇప్పుడు మోదీ దగ్గరికి వెళ్లి పైరవీలు చేసి క్లీన్ చిట్ తెచ్చుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa