తెలంగాణ రైతులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో దెబ్బతిన్న వ్యవసాయ భూములను పునరుద్ధరించడానికి ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్‌శాఖ మార్గదర్శకాలను జారీచేసింది. ఈ ఉపాధిహామీ కింద ఉపాధిహామీ కార్మికులతో పొలాల్లో పేరుకుపోయిన ఇసుకను తొలగించానున్నారు. దీంతో రైతుల పొలాలు తిరిగి సాగుకు అనుకూలంగా మారనున్నాయి. ఈ నిర్ణయం వల్ల రైతులకు చాలా మేలు జరుగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa