పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్టేషన్ ఘన్‌పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ‘ గతంలో కేసీఆర్ 36 మందిని పార్టీలో చేర్చుకున్నారు. ఒక్కరి మీదైనా అనర్హత వేటు వేశారా? పార్టీ మారి పదవి అనుభవించట్లేను. నేను ఏ పార్టీలో ఉన్నాననే విషయం స్పీకర్ తేలుస్తారు. స్పీకర్‌కు కోర్టు సూచన చేసింది.. ఆదేశాలు ఇవ్వలేదు’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa