సంగారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి 109 మంది లబ్ధిదారులకు 55 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ జూలకంటి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, బ్లాక్ ప్రెసిడెంట్ రఘుగౌడ్, కంది మండల అధ్యక్షుడు మోతి లాల్, సదాశివపేట మండల అధ్యక్షుడు సిద్ధన్న, నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa