రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సంబంధిత దస్త్రం రాజ్‌భవన్‌కు చేరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఫైల్‌ను అందుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, దీనిపై న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వారి సూచనల అనంతరం గవర్నర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతకుముందు, ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), కేటీఆర్‌తో పాటు ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఏసీబీ నివేదికను పరిశీలించిన విజిలెన్స్ కమిషనర్ కూడా ఇందుకు పచ్చజెండా ఊపారు. ఈ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం ఇప్పుడు గవర్నర్ అనుమతి కోసం ఫైల్‌ను ముందుకు పంపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa