చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా, కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డు వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ శుక్రవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణలో స్త్రీ శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని, ఆమె పోరాట స్ఫూర్తి ఈ తరం యువతకు మార్గదర్శకమని, బలహీన వర్గాల కోసం, సమాజ హక్కుల కోసం ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, మనమంతా ఆమె స్ఫూర్తిని అనుసరించాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa