పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచే లక్ష్యంతో రష్యాకు చెందిన ‘నీరీ’ అనే సంస్థ సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. ఆవుల మెదడులో నేరుగా న్యూరో-ఇంప్లాంట్లను (బ్రెయిన్ చిప్స్) అమర్చి, వాటి ద్వారా పాల దిగుబడిని నియంత్రించేందుకు ప్రయోగాలు ప్రారంభించింది. రష్యాలోని స్వెర్డ్‌లోవ్స్క్ ప్రాంతంలో ఇప్పటికే ఐదు ఆవులపై ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రక్రియలో, ఆవు తల వెనుక భాగంలో ఒక స్టిమ్యులేటర్‌ను అమర్చి, దాని నుంచి వచ్చే ఎలక్ట్రోడ్లను మెదడులోని కీలక భాగాలకు అనుసంధానిస్తారు. ఈ చిప్స్ ద్వారా విద్యుత్ సంకేతాలను పంపి ఆవుల ఆకలి, ఒత్తిడి, పునరుత్పత్తి వ్యవస్థలను నియంత్రించవచ్చని నీరీ సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు, ఒక ఆవుకు ఆకలి మందగిస్తే, ఈ సిస్టమ్ ద్వారా మెదడును ఉత్తేజపరిచి తిరిగి ఆకలి పెరిగేలా చేయవచ్చు. శస్త్రచికిత్స సమయంలో ఆవులు స్పృహలోనే ఉన్నాయని, ప్రక్రియ తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తిరిగి తమ పనుల్లో నిమగ్నమయ్యాయని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa