బీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద జరుగుతున్న ఈ విచారణకు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తన న్యాయవాదులతో హాజరయ్యారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ ప్రాంగణంలో అక్టోబర్ 6 వరకు కొన్ని ఆంక్షలు అమల్లో ఉంటాయని, రికార్డింగ్ లేదా ఫోటోలు తీస్తే జప్తు చేస్తామని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa