భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రూ. 370 లక్షల వ్యయంతో నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు భూమిపూజ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యార్థం ఈ బస్టాండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రేగొండ మండలం పరకాల, భూపాలపల్లి, ములుగు, చిట్యాల, టేకుమట్ల పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa