పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో డీసీపీ కరుణాకర్‌తో కలిసి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. జిల్లాలో రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మొదటి విడతలో 7 మండలాల్లో, రెండవ విడతలో ఆరు మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa