ఆసియా కప్ ఫైనల్లో రాణించిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు.క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి తిలక్ వర్మ ముఖ్యమంత్రిని కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే
.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa