తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు ఈ నెల 12 లోపు చెలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. లేకపోతే 13న సమ్మె బాట పడుతామని హెచ్చరించాయి. ఇవాళ కళాశాలల యాజమాన్యాలు అత్యవసర సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యచరణపై చర్చించాయి. దసరా లోపు ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు రూ.600 కోట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి విడుదల చేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa