జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని 9 పిఎంశ్రీ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ రియాలిటీ (ఏఆర్) మరియు వర్చువల్ రియాలిటీ (వీఆర్) ద్వారా విద్యార్థులకు బోధన అందించనున్నారు. తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఈ మేరకు శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఒక్కో పాఠశాలకు 10 లక్షల రూపాయల విలువైన పరికరాలు అందించినట్లు తెలిపారు. ఈ నూతన సాంకేతికతతో విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందుతుందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa