TG: మొక్కజొన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా వెల్లడించారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో, సీఎం సూచనతో మార్క్ ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa