తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో భారీగా వరద సంభవించి రుద్రారం గ్రామంలో ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ఈ వరద కారణంగా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా స్థానిక పోతిరెడ్డి చెరువు వద్ద వాగు దాటే ప్రయత్నంలో అంబతాపూర్ కు చెందిన దంపతులతో పాటు మరొకరు కొట్టుకుపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa