మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ 5వ వార్డ్ శ్రీనివాస్ నగర్ కాలనీలో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గృహప్రవేశ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరై, లబ్ధిదారుల ఇళ్లను ప్రారంభించారు. పేద కుటుంబాలకు మరిన్ని ఇళ్లు అందేలా కృషి చేస్తామని వజ్రేష్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa