ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటు వేయడానికి వచ్చి.. తండ్రిని చంపిన కొడుకు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 12, 2025, 11:33 AM

TG: పంచాయతీ ఎన్నికల వేళ మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గూడూరు మండలం దామరవంచ శివారులోని హట్యతండాలో ఓ వ్యక్తి తన తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు. పంచాయతీ ఎన్నికల కోసం ధారావత్ కృష్ణ హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో తన తండ్రి ధారావత్ నందిరాం నాయక్ ను రోకలిబండతో కొట్టి చంపేశాడు. గురువారం ఇద్దరూ ఎన్నికల్లో ఓటు వేశారు. ఆ తరువాత మద్యం మత్తులో గొడవపడటంతో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa