ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయంలో అక్రమంగా మురుగునీటిని (Septic Waste) పారబోసినట్టు ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. దీనిపై జలమండలి స్పందించింది. హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన గండిపేట జలాశయంలో అక్రమంగా మురుగునీటిని పారబోయడానికి యత్నించిన ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకర్‌ను జలమండలి అధికారులు పట్టుకున్నారు.
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేసారు.సంఘటన వివరాలు:డిసెంబర్ 17, 2025 ఉదయం 8:00 గంటల సమయంలో, హిమాయత్ నగర్ గ్రామం వద్ద ఉన్న ఎఫ్.టి.ఎల్ (FTL) పాయింట్ నంబర్ 428 వద్ద TG11 T1833 నంబర్ గల సెప్టిక్ ట్యాంకర్ అక్రమంగా మురుగునీటిని జలాశయంలోకి వదలడానికి యత్నించినట్లు పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు.
విచారణలో, డ్రైవర్ రామవత్ శివ నాయక్ (33) మరియు హిమాయత్ నగర్ నివాసి నిరంజన్ ఆదేశాల మేరకు ఈ అక్రమ పనికి పాల్పడినట్లు అంగీకరించారు.తీవ్రమైన ఉల్లంఘనలు: ఈ ఘటనలో జలమండలి అధికారులు ప్రధానంగా మూడు అంశాలను గుర్తించారు:లోగో దుర్వినియోగం: సదరు ట్యాంకర్‌పై ఎటువంటి అనుమతి లేకుండా HMWSSB లోగోను వినియోగించారు. ప్రజలను మరియుఅధికారులను నమ్మించి, తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా మోసపూరితంగా లోగోను వాడినట్లు తేలింది.అక్రమ వాహనం: ఈ వాహనం బోర్డులో నమోదు చేయబడలేదు. అలాగే నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని బోర్డు కోరింది.పర్యావరణానికి హాని: రక్షిత జలాశయంలో మురుగునీరు కలపడం వల్ల లక్షలాది మందికి సరఫరా అయ్యే తాగునీరు కలుషితమై ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
జలమండలి ప్రజలకు జల మండలి ఎండీ విజ్ఞప్తి:ఉస్మాన్ సాగర్ జలాశయంలో మురుగునీటిని పారబోసినట్టు ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతోందని మా దృష్టికి వచ్చింది. ఆ నిజానికి ఒక ట్యాంకర్ క్లీనింగ్ చేసి తీసుకెళ్ళిన ట్యాంకర్ ను మా డిజిఎం పట్టుకొని ఆ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో లారీ డ్రైవర్, ఓవర్ ఇద్దరిపై క్రిమినల్ కేస్ నమోదు చేసామని అన్నారు. అలాగే జంట రిజర్వాయర్లలో చుట్టుపక్కల నుంచి సీవరేజ్ వాటర్ అప్పుడప్పుడు వస్తుందని జలాశయానికి రెండు వైపులా ఎస్టీపీలు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. మరో ఆరు నెలల్లో ఆ ఎస్టీపీలు పూర్తయితే ఆ ప్రాంతంలోని నుంచి వచ్చే సీవరేజ్ ని కూడా 100% ట్రీట్మెంట్ చేయడానికి వెసులుబాటు దొరుకుతుందని ఎండీ వివరించారు.
అలాగే ఉస్మాన్ సాగర్ ఎలాంటి వ్యర్థాలు కలవలేదని, ఈ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐఎస్ ప్రమాణాలతో మూడంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, కాబట్టి మనకి నాకు డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం లేదని అన్నారు.
జలమండలి గండిపేట నీటిని ఆసిఫ్ నగర్, మీరాలం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లకు తరలించి ప్రతి గంటకూ నీటి ప్రమాణాలను పరీక్షిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. అక్కడ నీటి సరఫరాలో జలమండలి ఇప్పటికే మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ పద్ధతిని అవలంబిస్తుందని ఆయన తెలిపారు. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాల (డబ్య్లూటీపీ) వద్ద, రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల (ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు.
దీంతో పాటు ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. నగర ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఇండియన్ స్టాండర్డ్ (ఐఎస్ - 10500-2012) ప్రమాణాల్ని పాటిస్తూ.. శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటామని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.
తాగునీటి వనరులను కలుషితం చేసే ఏ చర్యలనైనా బోర్డు సహించబోదని.. అలంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెంచుతుమని ఈ సందర్బంగా అశోక్ రెడ్డి అన్నారు. జలాశయాల పరిసరాల్లో ఎవరైనా అక్రమంగా వ్యర్థాలను పారబోస్తున్నట్లు గమనిస్తే, వెంటనే స్థానిక అధికారులకు లేదా జలమండలి 155313 కస్టమర్ కేర్ నంబర్‌కు సమాచారం అందించాలని బోర్డు కోరుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa