ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానాల గుట్టల్లో చిరుత సంచారం: భయాందోళనల్లో స్థానికులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 12:41 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గుట్టల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి రుద్రంగి - మానాల మధ్యగల బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఓ ఆవుల మంద వద్దకు చిరుత వచ్చినట్లు వారు చెప్పారు. సమీపంలోని ఇటుక బట్టీలలో పనిచేసేవారు కూడా చిరుత వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో ఇక్కడిది కాదని వారు స్పష్టం చేశారు. ఈ వార్తతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa