గద్వాల జిల్లాలో దారుణ ఘటన నెలకొంది. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తకు పిల్లలు పుట్టడంలేదని మొదటి భార్య తన చెల్లిని రెండో వివాహం చేయించింది. ఈ రెండో భార్య కూతురిపై (16) తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో, విషయం బయటకు రాకుండా అబార్షన్ చేయించాడు. స్థానికంగా తెలిసిన మహిళ ద్వారా ఈ విషయం బయటపడటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa