ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యువరాజ్ సింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 06:21 PM

భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నాడు. నిన్న రాత్రి నగరానికి చేరుకున్న ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈరోజు సాయంత్రం 5 గంటలకు నోవాటెల్‌లో జరగనున్న 'బిగ్ అకాడమీ' గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి యువరాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ ఇచ్చే ఈ అకాడమీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవంలో భాగంగానే యువరాజ్ నగరానికి వచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa