తెలంగాణ ప్రభుత్వం 'వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని' పునరుద్ధరించేందుకు రెడీ అయింది. సాగు ఖర్చులు, కూలీల కొరతతో సతమతమవుతున్న అన్నదాతలకు ఈ పథకం కింద ఆధునిక యంత్రాలు ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీతో యంత్రాలు లభించనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో ఈ నెల 9న ఈ పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో నూతన శకం ఆరంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa