ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగులో అభియోగపత్రం: దుండిగల్ పోలీస్ శాఖలో కొత్త ఒరవడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 12:22 PM

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంగ్లీషులో జరిగే అధికారిక వ్యవహారాలకు భిన్నంగా, దుండిగల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప, తన దర్యాప్తును మాతృభాష తెలుగులోనే కొనసాగించి, తెలుగులో అభియోగపత్రం దాఖలు చేశారు. 2025లో తనకు కేటాయించిన రెండు కేసుల్లో, వెంకటేష్ అనే వ్యక్తి అక్రమ మద్యం నిల్వలు, అమ్మకాల కేసులో ఎక్సైజ్ చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి, మేడ్చల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టుకు తెలుగులో అభియోగపత్రం సమర్పించారు. ఈ చర్య పోలీస్ శాఖలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa