ముషీరాబాద్ నియోజకవర్గంలో, ఎమ్మెల్యే ముఠాగోపాల్ తన క్యాంప్ కార్యాలయంలో 23 మంది దరఖాస్తుదారులకు సుమారు రూ. 7,50,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, నిరుపేదలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షులు ఎం రాకేష్ కుమార్, శంకర్ ముదిరాజ్, కొండ శ్రీధర్ రెడ్డి, శ్యామ్ యాదవ్, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, సీనియర్ నాయకులు ముఠా నరేష్, శివ ముదిరాజ్, బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa