ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాల పునర్విభజన చిక్కు.. MPTC, ZPTC ఎన్నికలపై అనిశ్చితి!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 10:29 AM

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన హాట్‌ టాపిక్‌గా మారింది. జిల్లాల హేతుబద్దీకరణపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి, పార్టీల అభిప్రాయాలు తీసుకుని మార్గదర్శకాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ ఏడాది చివరి వరకు సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రస్తుత జిల్లాల ప్రాతిపదికన జరుగుతాయా లేక పునర్విభజన తర్వాత జరుగుతాయా అనే చర్చ మొదలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa