సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులు కొత్త ధాన్యాన్ని ఇంటికి చేర్చి, కొత్త బియ్యంతో పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు వంటి పిండివంటలు చేస్తారు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యం పెడతారు. ఈ పండుగలో ప్రకృతితో పాటు పశువులను కూడా పూజిస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వుల వాడకం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడం వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. వీటిని తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేయడానికి నువ్వులు తీసుకోవాలని పెద్దలు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa