రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాల హేతుబద్దీకరణపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి, పార్టీల అభిప్రాయాలు తీసుకుని మార్గదర్శకాలు ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది. ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ ఏడాది చివరి వరకు సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రస్తుత జిల్లాల ప్రాతిపదికన జరుగుతాయా లేక పునర్విభజన తర్వాత జరుగుతాయా అనే చర్చ మొదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa