ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బాసర బ్రాంచ్ ఆధ్వర్యంలో రెండు ఈ-టికెట్ మెషీన్లు, ఈ-హుండీ క్యూఆర్ కోడ్లను ఆలయ ఈవో అంజనీ దేవికి అందజేశారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా భక్తులు ఆన్లైన్లో విరాళాలు అందించవచ్చు. ఈ-టికెట్ మెషీన్లు భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడతాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజినల్ మేనేజర్ నవీన్ కుమార్, సీనియర్ మేనేజర్ విలాస్, బాసర బ్రాంచ్ మేనేజర్ తేజస్వి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa