TG: ఓ మదర్సా టీచర్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన గోల్కొండ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. టోలిచౌకి గుల్షన్ కాలనీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ముగ్గురు కూతుర్లకు అరబిక్ భాష బోధించేందుకు బీహార్ కు చెందిన నస్తీర్ రజాక్ (19) అనే వ్యక్తిని టీచర్‌గా నియమించాడు. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో రజాక్ ఓ బాలిక(7) ప్రైవేట్ భాగాలను ముట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని పేరెంట్స్ కి చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa