ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీఎస్‌సీ సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల.. మే 24న ప్రిలిమ్స్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 05, 2026, 12:31 PM

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) 2026 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (సీఎస్‌ఈ), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) పరీక్షల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా 933 సివిల్‌ సర్వీసెస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మే 24, 2026న, మెయిన్‌ పరీక్ష ఆగస్టు 21, 2026న ప్రారంభమవుతాయి.ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, ఆగస్టు 1, 2026 నాటికి మీకు 21 ఏళ్లు నిండి ఉండాలి. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే చాలు, పర్సెంటేజీతో పనిలేదు. జనరల్ అభ్యర్థులకు 32 ఏళ్ల వరకు వయస్సు, 6 అటెంప్ట్స్ ఉంటాయి; ఓబీసీ వారికి 35 ఏళ్లు, 9 అటెంప్ట్స్; ఎస్సీ/ఎస్టీ వారికి 37 ఏళ్ల వరకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఈసారి రూల్స్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆల్రెడీ ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్‌లో సెలెక్ట్ అయిన వారు ఈ ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు. ఐపీఎస్‌లో ఉన్నవారు రాసుకోవచ్చు కానీ, మళ్లీ ఐపీఎస్‌ని ఆప్షన్‌గా పెట్టుకోలేరు. ఈ క్లారిటీ లేకుండా ఫామ్ ఫిల్ చేస్తే మీ అటెంప్ట్ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa