ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాపిరెడ్డి ఆర్‌జీకే కాలనీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 10:39 AM

ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం, మస్జిద్ బండాలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పాపిరెడ్డి ఆర్‌జీకే కాలనీకి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ గారు సమక్షంలో వెంకట్, రాంబాబు నాయకత్వంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది.ప్రజావ్యతిరేక విధానాలతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విసుగు చెందిన కార్యకర్తలు,ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే కేసీఆర్ గారి బీఆర్‌ఎస్ పార్టీపైనే ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని ఈ చేరికలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలపడుతూ,రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాలతో ఘన విజయం సాధించడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్.జమ్మయ్య, సాయి నందన్ ముదిరాజ్, పవన్, శ్రీకాంత్ యాదవ్, గడ్డ మహేష్, సురేష్, అనిల్, అశోక్, రాజు చారి, జాకీర్, మస్తాన్, మరియు కొత్తగా పార్టీలో చేరిన కంకప్ప,ప్రభాకర్, యల్లలింగ్, యల్లప్ప, తిరుపతి, రాజు గోటేకర్, బియ్య, సంతోష్, సంజయ్, బస్వారాజ్, నగేష్, ఉదయ్ కుమార్, వెంకటేష్, తదితరాలు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa