ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదు : ఎమ్మెల్యే నోముల భగత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 12:59 PM

యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్‌లో అభివృద్ధి జరగలేదని, అందుకే కాంగ్రెస్ ఓటు అడిగే హక్కు లేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 1వ వార్డులో శ్రావణి, 2వ వార్డులో ఘని, 3వ వార్డులో హర్ష, 4వ వార్డులో యల్ అన్నపూర్ణ, 5వ వార్డులో పెద్దయ్య, 6వ వార్డులో సపావత్ చంద్రమౌళి, 7వ వార్డులో సయ్యద్ షాహిదాబేగం, 8వ వార్డులో నకిరెకంటి రమణ, 9వ వార్డులో బత్తుల శేఖర్ బాబు, 10వ వార్డులో కోడ సరోజ, 12వ వార్డులో ఎర్ర మంజుశ్రీలు ఎన్నికల బరిలో ఉన్నారు.నల్లగొండ కార్పొరేషన్‌ పరిధిలోని ఆర్జాలబావి డివిజన్లో 17వ డివిజన్‌ అభ్యర్థ్ధి మందడి లిఖిత సైదిరెడ్డి అదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధ్దికి పాటుపడిన బీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa