రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై టాక్సీ సేవల తరహాలో ట్రాక్టర్, హార్వెస్టర్ల వంటి వ్యవసాయ యంత్రాలను మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను తీసుకురానుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే రైతులు తమ గ్రామ పరిధిలో ఉన్న యంత్రాల వివరాలు మొబైల్‌లోనే చూసి, అవసరమైన తేదీ-సమయం ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు. పంటల సీజన్లలో యంత్రాల కొరత సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చే దశకు వచ్చింది. ఫామ్ యాప్ వల్ల రైతులు కూలీలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది, ధరల విషయంలో పారదర్శకత పెరుగనుందని అంచనా
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa