ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ కార్పొరేషన్ పోటీలో మహిళల జోరు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 02:11 PM

కరీంనగర్ నగరపాలక ఎన్నికల్లో మహిళలు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కేటాయించిన రిజర్వేషన్లకే పరిమితం కాకుండా, జనరల్ స్థానాల్లోనూ పురుషులతో పోటీ పడుతూ సత్తా చాటుతున్నారు. మొత్తం 66 డివిజన్లలో 398 మంది పోటీలో ఉండగా, అందులో 214 మంది మహిళలే కావడం విశేషం. ప్రధాన పార్టీలు సైతం గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తూ మహిళలకు బీసీ జనరల్ సీట్లను కేటాయించాయి. కొన్ని చోట్ల స్వతంత్రులుగా కూడా రంగంలోకి దిగారు.రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు తాయిళాల పంపిణీకి తెగబడుతున్నారు. కులాలవారీగా తాయిలాలు, మహిళా సంఘాలకు నగదు, ఇంటింటికీ మటన్, చికెన్, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా పంపకాల్లో ముందుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెరగడంతో అభ్యర్థులు ప్లాట్లు, పొలాలు, బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఒక్కో వార్డులో రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆర్థికంగా బలహీనులైన అభ్యర్థులు పోటీకి దూరమవుతున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa