ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ అహంకారపూరిత రాజకీయాల వలనే బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకి పాల్పడ్డాడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 02:59 PM

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు ముందు మక్తల్ లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. అధికార పార్టీ కాంగ్రెస్ అహంకారపూరిత రాజకీయాలు, మాఫియా బెదిరింపుల వల్లే తమ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. మహదేవప్ప మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, అతని కుటుంబానికి సంతాపం తెలిపారు. మంత్రి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపుల వల్లే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని రామచందర్ రావు డిమాండ్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa