ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాదులో డీజీపీ ఆఫీసు ముట్టడికి యత్నించిన బీజేపీ కార్యకర్తలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 03:04 PM

మున్సిపల్ ఎన్నికల వేళ మక్తల్ లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడంపై ఆ పార్టీ ఆందోళన చేపట్టింది. మహదేవప్ప మృతికి కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు హైదరాబాదులో డీజీపీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు చేరుకోవడంతో డీజీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బారికేడ్లతో వారిని అడ్డుకునేందుకు యత్నించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ డీజీపీ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. ఖైరతాబాద్‌ డీసీపీ శిల్పవల్లి కిందపడిపోయారు. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa