ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 07:09 PM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 108 అత్యవసర అంబులెన్స్‌ను బేసిక్ లైఫ్ సపోర్ట్ నుంచి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్‌గా తీర్చిదిద్దారు. మంగళవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ వాహనాన్ని పరిశీలించారు. ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్, డీఫిబ్రీలేటర్, మానిటర్ వంటి అత్యవసర పరికరాల పనితీరును ఆమె పరిశీలించి, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అత్యవసర సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని సిబ్బందికి సూచించారు. వాహనంలోని రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నయీమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa