గత మార్చి 20న జరిగిన జాతీయ ఉపకార వేతన పరీక్షలో మెరిట్ కార్డ్స్ కు ఎంపికైన విద్యార్థులు ఈనెల 30 లోగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in లో వివరాలు నమోదు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి సూచించారు. విద్యార్థులు మెరిట్ కార్డుల వెనుక సూచించిన మార్గదర్శకాలను అనుసరించి వివరాలు నమోదు చేసుకునేలా ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ శ్రద్ధ తీసుకోవాలని కోరారు.