ఈపీఎఫ్ చందాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.5% వడ్డీ జమ కానుంది. ఈ నిర్ణయంతో 5 కోట్ల మందికి పైగా పీఎఫ్ చందాదారులకు లబ్ధి చేకూరనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కూడా పీఎఫ్ డిపాజిట్లపై 8.5% వడ్డీ అందింది. అయితే, మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవడానికి 4 సులభమైన మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈపీఎఫ్‌వో పోర్టల్:
ఈపీఎవో సభ్యత్వ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు www.epfindia.gov.in వెబ్‌సైట్ కు వెళ్లి కూడా బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో ‘అవర్ సర్వీసెస్’లోని ‘మెంబర్ పాస్‌బుక్’ విభాగంలోకి వెళ్లాలి. ఆ తర్వాత యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయడానికి మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ వివరాలు ఎంటర్ చేసి మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.
మిస్డ్ కాల్ సర్వీస్:
ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్ కు మిస్డ్‌కాల్ ఇవ్వాలి. మీరు ఈ నెంబర్ కి కాల్ చేస్తే ఓ రింగ్ అయి వెంటనే కాల్ కట్ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.
ఉమంగ్ యాప్:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అందుకోసం ఉమాంగ్ యాప్ లోని ఈపీఎఫ్‌వోను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ‘ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లి ‘వ్యూ పాస్‌బుక్’ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్ నంబర్ తో పాటు మీ మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు కనిపించే మెంబర్ ఐడీని క్లిక్ చేస్తే పీఎఫ్ బ్యాలెన్స్‌ను పొందొచ్చు. అయితే, మీ పీఎఫ్ ఖాతాతో మొబైల్ నంబర్ ముందే లింక్ చేసి ఉండాలి.
ఎస్ఎంఎస్ ద్వారా..
యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న చందాదారులు ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 77382 99899 నంబర్ కు ఎస్ఎంఎస్ చేయాలి. ప్రస్తుతం ఈ సదుపాయం 10 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని ఎస్ఎంఎస్ సెండ్ చేయాలి.