విజయనగరం, గజపతినగరం: బొండపల్లి మండలం లోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరీ దేవి ఆలయం లో అమ్మవారికి శనివారం భాద్రపద పౌర్ణమి పురస్కరించుకొని విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి లలితా సహస్ర పారాయణం, సూక్తం పారాయణంతో కుంకుమార్చన జరిపారు. అనంతరం ఆలయంలో కొలువైన శ్రీ వరసిద్ధి గణపతికి వినాయక నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa