ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు సరస్వతీ దేవీగా కనిపించారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువయ్యింది. సరస్వతీ దేవి దర్శనం కోసం క్యూలైన్లలో కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరడంతో ఆలయ అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. తెల్లవారు జాము 2 గంటల నుంచే సరస్వతి దేవీగా అమ్మవారు దర్శనమిచ్చారు.