గంగాధర నెల్లూరు మండలం, వేపం జేరిలో వెలసిన శ్రీ అష్టలక్ష్మి, సమేత శ్రీ లక్ష్మీనారాయణస్వామి వారి ఆలయంలో సోమవారం ఉదయం స్వామివారిని ఆలయ అర్చకులు సుప్రభాత సేవతో మేల్కొలిపి, సహస్రనామార్చనలతో వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. పరిమళభరిత పుష్పాలతో అలంకరించి, మంగళ హారతులతో పాటు నైవేద్యం సమర్పించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉభయదారులుగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం ట్రస్ట్ నిర్వాహకులు కే. ఎస్. శ్రీధర్ దంపతులు వ్యవహరించారు.